దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు రద్దు!
త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఎన్ టి ఏ
నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, మే 3న దేశవ్యాప్తంగా జరిగిన వైద్య, విద్యా, ప్రవేశ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. లీకైన పత్రాలకు అసలు ప్రశ్న పత్రంతో పోలికలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులు ఇప్పటికే నీట్ -2026 కోసం చేసిన రిజిస్ట్రేషన్ అలాగే కొనసాగుతుం దని ఎన్ టి ఏ, తెలిపింది. ఎంపిక చేసిన పరీక్ష కేంద్రా ల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవస రం కూడా లేదని స్పష్టం చేసింది.
కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ వివరాలు అన్నీ కేవలం ఎన్ టి ఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ప్రకటిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, ఫేక్ మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధి కారిక సమాచారాన్నే అనుసరించాలని సూచించింది.రాజస్థాన్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం వల్లనే రద్దు చేసినట్లు సమాచారం
ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు గుర్తింపు .
ఈ అంశం మీద సీబీఐ విచారణ జరిపిస్తామని, కేంద్రం తదుపరి ఆదేశాలు ఇచ్చిన తరువాత ఎలాంటి ఫీజు లేకుండా మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన NTA