Take a fresh look at your lifestyle.

శాంతినగర్ పట్టణంలో  వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు.

0 19

శాంతినగర్ పట్టణంలో  వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు.

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణానికి చెందిన స్థానిక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు .

ఈ సందర్భంగా శాంతినగర్ పట్టణానికి చెందిన దురేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ అయోధ్య రామచంద్ర మూర్తికి పాదుకలు సమర్పించనున్నారు.

పట్టణం లోని శ్రీ సీతారాముల ఆలయంలో వారు చేయించిన పాదుకలు ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి పురవీధుల గుండా  రామనామం స్మరిస్తూ శ్రీ పల్లె ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు  పాదుకలు తలపై మోస్తూ అక్కడ ఆలయంలో గల శ్రీ సీతారాముల వారికి, శివుడికి ఆంజనేయస్వామి వారికి ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు . అనంతరం ఆంజనేయ స్వామి జయంతి ని పురస్కరించుకొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి గీతాలు ఆలపించారు. తదుపరి విచ్చేసిన భక్తులందరికీ విహెచ్పి పట్టణ అధ్యక్షుడు కోడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ అరటి పండ్లు పంపిణీ చేశారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ వెంకటేశ్వర్లు, శాంతినగర్ పట్టణ అధ్యక్షుడు కోడి వెంకటేశ్వర్లు, వీహెచ్పీ మాజీ ప్రధాన కార్యదర్శి గాయత్రి శ్రీనివాసులు, కోశాధికారి జీతూరి రమేష్, విహెచ్పీ సభ్యులు మహేష్, విజయ్ , మురళి, షరాఫ్ వెంకటేష్ , గో ప్రచారక్ వెంకటేష్ , కురువ ఈదన్న , మీసేవ అనిల్, వెంకట్రావు, జీపు వాసు దంపతులు,జీప్ రమేష్, కొంకల రవి ప్రకాష్ రెడ్డి,రామాలయం అధ్యక్షుడు రఘునాథ్ ,రమణ ,రామాలయం అర్చకులు సంతోష్ మరియు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.