నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆకార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ఈఅంశాలపై పార్టీ అగ్రనేతలతో కీలక చర్చల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.