సమ్మె విరమిస్తున్నాం : ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్ :తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు అధికారికంగా ప్రకటించారు.తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్య ల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్లు సంకేతాలు కనిపిస్తున్నా యి. మంత్రుల బృందం , ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన తాజా చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశా లపై ప్రభుత్వం సానుకూ లంగా స్పందించినట్లు తెలు స్తోంది.ఇప్పటికే 29 డిమాం డ్లకు సమ్మతించింది సర్కార్..
అయితే.. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేసే అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు సమాచారం. ఒకవేళ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం జరిగితే, గుర్తింపు ఎన్నికలు పీఆర్‌సీ,వంటి అంశాలు స్వయంగా పరిష్కారమ య్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగులలో కొంత ఆశా వాదం వ్యక్తమవుతోంది.
ఇక ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం స్వ యంగా చేపడుతుందని, ప్రైవేట్ డ్రైవర్ల నియామ కం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇది నగరంలో పనిచేస్తున్న సిబ్బందికి కొంత ఉపశ మనం కలిగించే అంశంగా మారింది. అదేవిధంగా, కారుణ్య నియామకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న ఈ నియామకాలను పర్మి నెంట్ పద్ధతిలోకి మార్చి, వారికి స్థిరమైన వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబా లకు దీర్ఘకాలిక భద్రత లభించే అవకాశం ఉంది.
మొత్తం మీద, ఈ చర్చలు ఆర్టీసీ ఉద్యోగుల భవిష్య త్తుపై సానుకూల సంకేతా లను ఇస్తున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల బృందం హామీ ఇచ్చినట్లు తెలుస్తోం ది. అయితే, ఈ నిర్ణయాలు అధికారికంగా అమలులోకి వచ్చే వరకు ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిరవధిక సమ్మె శుక్రవారం రాత్రి, ముగిసింది ప్రభు త్వంతో కుదిరిన ప్రాథమిక ఒప్పందం మేరకు సమ్మె ముగిస్తున్నట్లు జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం 11% పిఆర్సి గుర్తింపు సంఘాల ఎన్నికలు, ఆర్టీసీలో ఖాళీల భర్తీ,వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇవ్వడమే కాకుండా కొన్ని డిమాండ్లపై వ్రాతపూర్వక హామీ ఇచ్చినట్టు సమాచారం.