Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో స్కైవాక్ నిర్మాణం!

0 19

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో స్కైవాక్ నిర్మాణం!తెలంగాణ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మాణం జరగనుంది. అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్న ఈ స్టేషన్‌లో, మెట్రో, బస్సు, రైల్వేస్టేషన్‌లను అనుసంధానించేలా 120 మీటర్ల స్కైవాక్ నిర్మించనున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో దిగగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు, రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మెట్రో లేదా బస్టాఫ్‌కు చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి హెచ్‌ఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆర్టీసీ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కూడా ఆర్టీసీ భూమి అవసరం కాగా, అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.