సిద్దిపేట జిల్లా : అంబేద్కర్ ఆలోచనలు, విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ కొనియాడారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణంలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ రక్తం చిందించకుండా విజయం సాధించవచ్చని గాంధీ చాటితే, అందరికీ సమాన అవకాశాలు కల్పించి అభివృద్ధి సాధించవచ్చని అంబేద్కర్ నిరూపించారన్నారు. దేశానికి ఈ ఇద్దరు మహనీయులు రెండు కళ్ల లాంటి వారన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సోనియా గాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు జై భీమ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Next Post